
గుంటూరు జిల్లా సత్తెనపల్లి, రామకృష్ణాపురంలోని బాలయోగి గురుకులంలో కరోనా కలకలం రేపింది. 13 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. గురుకులంలో మొత్తం 420 మంది బాలికలు ఉండగా ర్యాండమ్ గా వారిలో 150 మందికి టెస్టులు చేయగా, 13 మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిన వారిలో 10 మందిని గుంటూరులోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అన్ని క్లాసులను శానిటైజ్ చేశారు.