
పాతబస్తీలోని ఓ ఆలయ పూజారికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత శనివారం కరోనా బారిన పడ్డారు. దీంతో హొం ఐసోలేషన్ లో ఉంటున్నారు. అయితే ఆయన శుక్రవారం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే ఎక్కడా పడకలు అందుబాటులో లేవని అన్నారు. దీంతో స్థానిక ఎంఐఎం పార్టీ నాయకుడి సాయంతో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి తమ గోడును విన్నవించుకున్నారు. వెంటనే ఆయన స్పందించారు. శాలిబండలోని ఓ ఆసుపత్రిలో బెడ్ ఏర్పాటు చేయించారు.