వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యం.. వాట్సాప్

వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సప్ తెలిపింది. ఇటీవల కంపెనీ తీసుకువచ్చిన నూతన ప్రైవసీ పాలసీ విధానంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాట్సాప్ కంపెనీ స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారత ప్రభుత్వం పంపిన లేఖపై స్పందించామని, యూజర్ల గోప్యతే మాకు ప్రధానమని హామీ ఇచ్చామని పేర్కొంది. కొత్త ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత సందేశాల గోప్యతకు భంగం కలుగదని, […]

Written By: Suresh, Updated On : May 25, 2021 1:50 pm
Follow us on

వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సప్ తెలిపింది. ఇటీవల కంపెనీ తీసుకువచ్చిన నూతన ప్రైవసీ పాలసీ విధానంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాట్సాప్ కంపెనీ స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారత ప్రభుత్వం పంపిన లేఖపై స్పందించామని, యూజర్ల గోప్యతే మాకు ప్రధానమని హామీ ఇచ్చామని పేర్కొంది. కొత్త ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత సందేశాల గోప్యతకు భంగం కలుగదని, రాబోయే రోజుల్లో వాట్సాప్ కార్యాచరణలో ఏ మార్పులుండవని చెప్పింది.