
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వ్యవసాయం శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్షిక రుణ ప్రణాళికను సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. మొత్తం 2.83 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించారు. వ్యవసాయ రంగానికి రూ. 1.48 లక్షల కోట్లు, పరిశ్రమలకు రూ. 44,500 కోట్ల రుణ ప్రణాళికను సిద్ధం చేశారు.