రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్ గా పనిచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్ణయించింది. కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కమిటీ కన్నీనర్, మాజీమంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదుయాష్కీగౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదన రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, అజారుద్దీన్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ అఫైర్స్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు ప్రజాకంటకంగా మారాయి. విద్యార్థి నిరుద్యోగ సమస్య పై అక్టోబర్ 2నుంచి డిసెంబర్ 9 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తీర్మానం చేశాం. 27న భారత్ బంద్ విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. పోడు భూముల సమస్య పై ప్రతిపక్ష పార్టీలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం.
దిలీసుఖ్ నగర్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తాం. ప్రభుత్వం ముందుకు రాకపోతే కాంగ్రెస్ పార్టీనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. పంజాగుట్టలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. లేదంటే కాంగ్రెస్ పక్షాన ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీయాలని, అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగ సమస్యపై ఉద్యమించాలని నిర్ణయించారు.