విజృంభించిన బిష్ణోయ్.. ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం

బిష్ణోయ్ విజృంబించడంతో ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం సాధించింది. ఐపీఎల్-14 లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో హైదరాబాద్ కథ ముగిసింది. ఎనిమిదో ఓటమితో ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్ అయ్యింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ పరుగుల కోసం చాలా కష్టపడింది. రాహుల్ 21 పరుగులు, మయాంక్ 5 పరుగులు మాత్రమే చేశారు. కాసేపు గేల్, మార్ క్రమ్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పరుగులు […]

Written By: Suresh, Updated On : September 26, 2021 9:16 am
Follow us on

బిష్ణోయ్ విజృంబించడంతో ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం సాధించింది. ఐపీఎల్-14 లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో హైదరాబాద్ కథ ముగిసింది. ఎనిమిదో ఓటమితో ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్ అయ్యింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ పరుగుల కోసం చాలా కష్టపడింది. రాహుల్ 21 పరుగులు, మయాంక్ 5 పరుగులు మాత్రమే చేశారు. కాసేపు గేల్, మార్ క్రమ్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పరుగులు వచ్చాయి.

ఓపెనర్లను హోల్డర్ ఓకే ఓవర్లో ఔట్ చేయడంతో పంజాబ్ ను గట్టి దెబ్బ తీసింది. మార్ క్రమ్ పోరాటంతో పంజాబ్ 100 కు చేరువైంది. తర్వాత దీపక్ హుడా, హర్ ప్రతీ్ బ్రార్ రాణించడంతో ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. రవి బిష్టోయ్, షమి విజృంభించడంతో సన్ రైజర్స్ ఓటబి తప్పలేదు. షమి ఆరంభంలోనే కీలకమైన వార్నర్, విలియమన్స్ న్ వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే సన్ రైజర్స్ ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. పవర్ ప్లేలో సన్ రైజర్స్ చేసిన పరుగులు 20 మాత్రమే. 13 ఓవర్లకు స్కోరు 60/5. రవి మిడిలార్డర్ పని పట్టాడు.

అయితే ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన హోల్డర్ అనూహ్యంగా చెలరేగాడు. 5 బంతుల వ్యవధిలో 3 సిక్సర్లు బాది హైదరాబాద్ ను పోటీలోకి తెచ్చాడు. సాహా రనౌటైపోయినా.. హోల్డర్ పోరాటం కొనసాగింది. అయితే 2 ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో 19వ ఓవర్లో అర్ష్ దీప్.. రషీద్ వికెట్ తీసి 4 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్ పంజాబ్ వైపు మొగ్గింది. చివరి ఓవర్లో రెండో బంతికి హోల్డర్ సిక్సిర్ బాదినా ఆఖరు నాలుగు బంతుల్లో ఎలిస్ 4 పరుగులే ఇచ్చి కింగ్స్ ను గెలిపించాడు. 10 మ్యాచ్ ల్లో పంజాబ్ కిది నాలుగో గెలుపు. హోల్గర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.