
తెలుగు అకాడమీ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వ నిర్ణయానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ తెలుగు భాషా అకాడమీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు భాషను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.