తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై లోక్ సభలో వైకాపా ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గెజిట్ నోటిఫికేషన్ పై ప్రశ్న లేవనెత్తారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ సమాధానమిచ్చారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. మరోవైపు పోలవరం అంశంపై చర్చకు వైకాపా ఎంపీలు పట్టుబడుతున్నారు. వెల్ లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు.