
మాన్సాస్ ట్రస్టు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. జీతాలు చెల్లించాలంటూ మాన్సాస్ కార్యాలయాన్ని ట్రస్టు కళాశాలల ఉద్యోగులు శనివారం ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. జీతాలు నిలిపియేయాలంటూ ఈవో బ్యాంకుకు లేఖ రాయడంతో వేతనాలు నిలిచిపోయాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. అశోక్ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈవో జోక్యం పెరిగిందని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.