
వాసాలమర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆ గ్రామస్తులతో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేశారు. అనంతరం వాసాలమర్రిలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊరికి కేవలం ట్రాక్టర్లు ఇచ్చి వెళ్లిపోతే సరిపోదన్నారు. వాసాలమర్రిలో ఒక ప్రత్యేకమైన పని జరగాలని చెప్పారు. వాసాలమర్రికి మరో 20 సార్తు వస్తానని వ్యాఖ్యనించారు. వాసాలమర్రిలో కేవలం నలుగురే తనకు పరిచయమయ్యారన్నారు. ఈ గ్రామం ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలని సూచించారు.