
కరోనా బారినపడ్డ ఐదుగురిలో సైటోమెగాలో వైరస్ సంబంధిత మలద్వార రక్త స్రావం కనిపించింది. దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఈ కేసులు బయటపడ్డాయి. రోగనిరోధక సామర్థ్యం సాధారణంగానే ఉన్నవారిలో ఈ సమస్య వెలుగు చూడటం ఇదే మొదటిసారని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఒకరు చనిపోయారన్నారు. కొవిడ్ పాజిటివ్ గా తేలిన 20-30 రోజుల తర్వాత వీరిలో సీఎంవీ లక్షణాలు కనిపించాయి.