
ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలకు భారత క్రీడా సంఘాలన్నీ క్రీడాకారుల పేర్లు సిఫార్సు చేస్తున్నాయి. జూన్ 21తో ముగిసిన గడువును పొడిగించడంతో జాబితాలు సిద్ధం చేస్తున్నాయి. బీసీసీఐ, ఫుట్ బాల్, రెజ్లింగ్ ఇతర సంఘాలు ఇప్పటికే కొందరి పేర్లను ప్రస్తావించాయి. రాజీవ్ ఖేల్ రత్నకు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మహిళల వన్డే, టేస్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్లను బీసీసీఐ సిఫార్సు చేసింది. అర్జున కోసం శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, జస్ర్రీత్ బుమ్రా పేర్లను ప్రతిపాధించింది.