
కడప జిల్లా దువ్వూరుకు చెందిన ఓ మైనార్టీ కుటుంబం సోషల్ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియోపై సీఎం జగన్ స్పందించారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తో మాట్లాడారు. ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వారంలో సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్ కు సీఎం ఆదేశించారు. మైదుకూరు గ్రామీణ సీఐ వ్యవహారంపై విచారణ జరిపి వారంలోగా చర్యలు తీసుకోవాలన్నారు. భూమికి సంబంధించి వారంలో కలెక్టర్ విచారించి నివేదిక ఇవ్వానలి ఆదేశించారు.