
తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో దత్తత గ్రామమైన వాసాలమర్రి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడి దళితవాడలో పర్యటించారు. స్థానికంగా ఉన్న రైతువేదికలో 130తో ఆయన సమావేశమయ్యారు. గతంలో ఇచ్చిన హామీల అమలును సీఎం సమీక్షించనున్నారు. జూన్ 22న ఈ గ్రామంలో పర్యటించిన కేసీఆర్ గ్రామస్థులతో సహపంక్తి భోజనం చేసి వారితో సమావేశమయ్యారు. సత్వర కార్యాచరణ కోసం అధికారులకు ఆదేశాలిచ్చారు.