
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్ మొదలైన తర్వాత వరుసగా నాలుగో రోజు 20 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,10,147 పరీక్షలు నిర్వహించగా 21,954 కేసులు పాజిటివ్ గా నిర్ధరణ అయ్యాయి. 72 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 13,353 మంది ప్రస్తుతం కొవిడ్ సెంటర్ లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకూ రాష్ట్రంలో 12,28,186 మంది వైరస్ బారిన పడగా, మొత్తం 1,70,60,446 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.