
కృష్ణా, గోదావరి నదీయాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో నీటిపారుదల శాఖపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇంజినీర్లు, అధికారులు, న్యాయవాదులతో సమావేశమయ్యారు. కృష్ణా, గోదావరి బోర్డుల నోటిఫికేషన్, ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలన్న అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ కుమార్ పాల్గొన్నారు.