
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాఫ్టర్ లో వరంగల్ కు చేరుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి మైదనం నుంచి ప్రత్యేక వాహనంలో సీఎం కేసీఆర్ ఎంజీఎంకు బయల్దేరారు. రెండు రోజుల కిందట గాందీ దవాఖానను పరిశీలించిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి, వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మిగతా జిల్లాల్లోనూ పర్యటించాలని సంకల్పించిన సీఎం ఇవాళ వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తున్నారు.