
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు కృష్టా, గోదావరి బోర్డుల గెజిట్ పై చర్చించనున్నట్లు సమాచారం.