
అగ్రి ఫండ్ ప్రాజెక్టులు, మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలు పై ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, మార్కెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.