CM Chandrababu: పాలనంటే హత్య రాజకీయాలు,కక్షసాధింపులుగా గత ప్రభుత్వం మార్చేవేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ వైసీపీ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని అన్నారు. దీన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తల, నాయకుల ప్రాణాలు తీశారని విమర్శించారు. వైసీపీ టీడీపీ నాయకులపై కేసులు పెట్టారు. కానీ ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని అభిందిస్తున్నా అని చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి అని చంద్రబాబు అన్నారు.