
డీఎల్ ఎఫ్ గ్రూప్ లంచం కేసులో మాజీమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కి క్లీన్ చీట్ ఇచ్చినట్లు సమాచారం. లాలూ ప్రసాద్ యాదవ్ కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో సీబీఐ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో ఇప్పటికే మూడున్నరేళ్లు లాలూ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చినా ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ తమ విచారణ కొనసాగించనుంది. యూపీఏ 2 ప్రభుత్వ హయంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ముంబై, ఢిల్లీలలో రైల్వే ప్రాజెక్టులు దక్కించుకునేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ ఎఫ్ లాలూకి లంచం ఇచ్చిందనేది ప్రధాన ఆరోపణ.