Congress Vs BRS Leaders: లైవ్ లోనే నేతలు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల చర్చాఘోష్టిలో ఈ వాగ్వాదం, కొట్లాట చోటు చేసుకుంది..తెలంగాణ రాజకీయ వేదికపై లైవ్ టెలివిజన్ డిబేట్‌లో అసభ్యకరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. నిరుద్యోగ సమస్యలపై చర్చించేందుకు నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఘర్షణకు దిగారు. బీఆర్ఎస్ నేత, “కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చదువుకు ఎలాంటి ఉద్యోగ పరీక్ష నిర్వహిస్తుందో చెప్పలేకపోతుంది” అంటూ విరుచుకుపడ్డారు.దీంతో కాంగ్రెస్ నేత కూడా తీవ్రంగా స్పందించడంతో వాగ్వాదం కాస్తా ఫిజికల్ ఫైట్‌గా మారింది. లైవ్ డిబేట్‌లోనే ఒకరిని ఒకరు తోసుకోవడం, అరవడం వంటి చేదు దృశ్యాలు ప్రసారమయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ప్రజాస్వామ్యంలో చర్చలు శాంతియుతంగా జరగాల్సిన సమయంలో ఇలా దుర్ఘటనలు చోటుచేసుకోవడం పట్ల సామాన్య ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఏ చదువుకు ఎం ఎగ్జామ్ పెడతారో తెలియదు ఈ కాంగ్రెస్ మూర్ఖులు నిరుద్యోగులతో మాట్లాడటానికి డిబేట్ లకు వెళ్తారు. pic.twitter.com/iAnVAyR8G9
— (@gumpumestri) July 3, 2025