Shubman Gill shows the way: గిల్ మరోసారి తన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూనే.. ప్రమాదకరమైన బంతులను డిఫెన్స్ ఆడాడు. ఒకరకంగా ఇంగ్లాండ్ బౌలర్లకు సింహ స్వప్నం లాగా నిలిచాడు. ఓవైపు సహచర ఆటగాళ్లు అవుట్ అవుతున్నప్పటికీ.. ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా మెరుగైన ఆట తీరును ప్రదర్శించాడు.. జడేజా (41) లాంటి ఆల్ రౌండర్ తో స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో కలిసి ఆరో వికెట్ కు ఏకంగా 99 పరుగులు జోడించాడు. ఐదు వికెట్లు తీసి జోరు మీద ఉన్న ఇంగ్లాండ్ బౌలర్లకు దిమ్మ తిరిగే విధంగా గిల్ బ్యాటింగ్ చేశాడు. ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఒక గోడలాగా నిలబడ్డాడు.
రెండో టెస్టు తొలి మ్యాచ్ మూడు సెషన్ లలో టీమిండియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. పరుగులు కూడా చెప్పుకునే స్థాయిలో చేయలేకపోయింది. దీంతో టీమిండియా మహా అయితే 280 పరుగులు చేయగలుగుతుందని అందరూ ఒక అంచనాకు వచ్చారు. కానీ వారందరి అంచనాలను గిల్ తలకిందులు చేశాడు.
రెండో టెస్టు తొలి రోజు ఇంగ్లాండు బౌలర్లు 15 పరుగుల వద్డే ఇండియా తొలి వికెట్ పడగొట్టారు. సూపర్ ఫామ్ లో ఉన్న కే ఎల్ రాహుల్ రెండు పరుగులు మాత్రమే చేసి వోక్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో యశస్వి జైస్వాల్ (87), కరుణ్ నాయర్(31) రెండో వికెట్ కు 80 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరిని కార్సే విడదీశాడు. కార్సే షార్ట్ పిచ్ బంతిని అంచనా వేయలేక నాయర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి జైస్వాల్ కూడా స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పటికే మైదానంలోకి వచ్చిన గిల్ ఆచితూచి ఆడుతున్నాడు. ఈ దశలో నితీష్ కుమార్ రెడ్డి(1) అంతగా ఆకట్టుకోలేకపోయాడు.. వోక్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో జట్టు తీవ్రమైన కష్టాల్లో పడింది. అప్పటికి జట్టు స్కోర్ 211 పరుగులు.
Also Read: బషీర్ బౌలింగ్లో ఔట్ అయిన తర్వాత.. రిషబ్ పంత్ డ్రెస్సింగ్ రూమ్ లో చేసిన పని వైరల్.. (వీడియో)
ఈ దశలో మైదానంలోకి వచ్చిన జడేజాతో కలిసి గిల్ స్ఫూర్తిదాయకమైన ఆట తీర్ ప్రదర్శించాడు. అప్పటిదాకా మూడు సెషన్ల ఆట లో ఇంగ్లాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఎప్పుడైతే జడేజా వచ్చాడో.. ఇక అప్పటినుంచి పరిస్థితి మారిపోయింది.
ఇంగ్లాండ్ బౌలర్ల పై భారత బ్యాటర్లు ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా గిల్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్ లో గిల్ కు ఇది రెండవ సెంచరీ.. 216 బంతులు ఎదుర్కొన్న అతడు 12 బౌండరీల సహాయంతో 114 పరుగులు చేశాడు. వాస్తవానికి అతడు నిలబడటం టీమిండియా కు ఎంతో ప్లస్ అయింది. లేకుంటే టీమిండియా 300 పరుగులు కూడా చేయకుండానే కుప్పకూలేది. ఈ దశలో గిల్ స్ఫూర్తిదాయకమైన బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. తద్వారా టీమ్ ఇండియా స్కోరును ఒకటో రోజు ఆట ముగిసిన తర్వాత ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులకు చేర్చాడు.
Also Read: సెప్టెంబర్ నుంచి ఆసియా కప్.. వేదిక మార్పు.. భారత్, పాకిస్తాన్ తలపడేది అప్పుడే?
రెండవ రోజు ఇంగ్లాండు బౌలర్లు విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. భారత బ్యాటర్లు మరింత స్ఫూర్తివంతంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత వచ్చే బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ మినహా మిగతా వారంతా ఇంగ్లాండు బౌలర్లను ప్రతిఘటించేంత సామర్థ్యం ఉన్నవారు కాదు. అందువల్ల గిల్ తొలిన్రోజు మాదిరిగానే రెండో రోజు కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే జడేజా కూడా తన బ్యాటింగ్ స్టైల్ కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడే భారత్ మరింత మెరుగైన స్థితిలో ఉంటుంది.