NTR Krishna District: ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్క విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. శుక్రవారం ఉదయం పటమల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర్ నగర్ కు చెందిన రామారావు అనే వ్యక్తి తన మనవరాలిని కళాశాల బస్సు ఎక్కించేందుకు తీసుకెళ్తున్నాడు. అదే సమయంలో అభి అనే యువకుడు జాగింగ్ చేస్తూ తనతో తీసుకువచ్చిన కుక్కను రామారావు మనవరాలిపై వదిలిపెట్టాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే తన కుమార్తెను ఏడిపిస్తున్నారంటూ యూవతి తండ్రి శ్రీనివాస్ రావు ఆకారణంగా తనపై చేయి చేసుకున్నారని అభి పటమల పోలీసు స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పెంపుడు కుక్క తెచ్చిన వివాదం.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. సీసీ కెమెరా దృశ్యాలు
కృష్ణా జిల్లా పటమట పోలీసుస్టేషన్ పరిధిలో ఓ పెంపుడు కుక్క విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం రామలింగేశ్వర్నగర్కు చెందిన రామారావు అనే వ్యక్తి.. తన మనవరాలిని కళాశాల బస్సు… pic.twitter.com/Xmp6rBLzFz
— ChotaNews App (@ChotaNewsApp) July 12, 2025