దేశంలోని సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తో సహా వివిధ దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంక కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో ధన్ బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సీజేఐ రమణ దర్యాప్తు సంస్థల తీరును తప్పుపట్టారు. తమకు ప్రాణహాని ఉందంటూ న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినా సీబీఐ సహా వివిధ దర్యాప్తు సంస్థలు స్పందించడం లేదని, వారికి ఏమాత్రం సాయంపడడం లేదని సీజేఐ విమర్శించారు.