
ట్రైబ్యూనళ్లపై కేంద్రం చేసిన కొత్త చట్టంపైై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము రద్దు చేసిన చట్టం తరహాలోనే ఉన్న మరో చట్టాన్ని చేయాల్సిన అవసరమేంటని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కోర్టు ముందు మూడు దారులున్నాయని తెలిపారు. ట్రైబ్యూనళ్లను రద్దు చేయమంటారా? లేదా కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలి? లేదా కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలా అని ప్రశ్నించారు.