https://oktelugu.com/

Supreme Court: జడ్జీల నియామకాల వార్తలపై సీజేఐ అసంతృప్తి

కొత్త జడ్జీల నియామకంపై మీడియాలో వార్తలు రావడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి నియామకాలపై రిపోర్డు చేసేటప్పుడు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. కొత్త జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు ఇవీ అంటూ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సుల ప్రకారం 2027 లో దేశానికి తొలి మహిళా సీజేఐ రాబోతున్నారని, ఆమె కర్ణాటక జడ్జిగా ఉన్న నాగరత్నే కావచ్చని వార్తలు […]

Written By: , Updated On : August 18, 2021 / 01:59 PM IST
CJI Ramana
Follow us on

CJI Ramana

కొత్త జడ్జీల నియామకంపై మీడియాలో వార్తలు రావడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి నియామకాలపై రిపోర్డు చేసేటప్పుడు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. కొత్త జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు ఇవీ అంటూ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సుల ప్రకారం 2027 లో దేశానికి తొలి మహిళా సీజేఐ రాబోతున్నారని, ఆమె కర్ణాటక జడ్జిగా ఉన్న నాగరత్నే కావచ్చని వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి నియామకాలపై అధికారిక ప్రకటన కంటే ముందే వార్తలు రావడం ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎన్వీ రమణ అన్నారు.