
సివిల్ సర్వీసెస్ 2020 కోసం ఇంటర్వ్యూ షెడ్యూల్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూల ఆగస్టు 2నుంచి సెప్టెంబర్ 22 వరకు నిర్వహించనున్నారు. ఇంతకుముందు ఈ ఇంటర్వ్యూలు ఏప్పిల్ 26నుంచి జరగాల్సి ఉండగా, కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా పడ్డాయి. సివిల్ సర్వీసెస్ ప్రీ అండ్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.upsc.gov.in ద్వారా ఇంటర్వ్యూ షెడ్యూల్ ను తనిఖీ చేసుకోవచ్చు.