
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతోందని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించామని తెలిపారు. ఎంసీహెచ్ఆర్డీలో పరిశ్రమలు, ఐటీ శాఖల వార్షిక నివేదికను ఇవాళ కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకత కోసమే వార్షిక నివేదిక విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ విధివిధానాలు, సమష్టి కృషితోనే ఈ రంగాల్లో అభివృద్ధి సాధ్యమైందన్నారు.