
చైనాను మలేరియా ఫ్రీ దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మలేరియా వ్యాధిని నిర్మూలించేందుకు చైనాకు 70 సంవత్సరాలు పట్టింది. 1940లలో 30 మిలియన్ల మలేరియా కేసులు నమోదు అయ్యేవి. కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి చైనా లో మలేరియా కేసులు నమోదు కాలేదు. చైనా తీసుకున్న చర్యల వల్ల కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టి చివరకు ఆ వ్యాధిని నిర్మూలించింది.