
ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను ఆయన కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. చంద్రమోహన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అభిమానులెవరూ నమ్మవద్దని కోరారు. చంద్రమోమన్ అనారోగ్యానికి గురై చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విషయం పై ఆయన కుటుంబీకులు, సన్నిహితులు ఈ మేరకు స్పందించారు.