
కొవిడ్ పై పోరాటంలో సిని నటుడు సోనూసూద్ సేవలను చంద్రబాబు కొనియాడారు. సేవ చేయడం సోనూసూద్ బాధ్యతగా భావిస్తున్నారని చెప్పారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవలపై వివిధ రంగాల నిపుణులతో ఆయన వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబూ మాట్లాడుతూ ఎన్నో విపత్తులను చూశానని కరోనా వంటి సంక్షోభం చూడటం ఇదే తొలిసారి అని అన్నారు. పకృతి విపత్తు సమయాల్లో ఎన్టీఆర్ ట్రస్టు, టీడీపీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు.