Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని సీఎం నిర్ణయించారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు.