
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయిధరమ్ తేజ్ తర్వరా కోలుకోవానలి రాజకీయనేతలు, సినీప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, ఇతర నటులు, నిర్మాతలు, డైరెక్టర్లు సాయిధరమ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. సాయిధరమ్ హెల్మెట్ ధరించడం సంతోషకరమని, యువత బైకుపై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.