
నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిరిసిల్ల పట్టణం నీటమునిగింది. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చేశాయి. వరద నీటిలో కార్లు కొద్దిదూరం వరకు కొట్టుకుపోయాయి. రోడ్ల పక్కన అమ్మకానికి ఉంచిన వినాయకుడి విగ్రహాలు సైతం కొట్టుకుపోయాయి. కలెక్టరేట్ లోకి భారీగా వరదనీరు చేరింది. బోనాల చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది.