
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తొలిరోజు ఆట నిలిచిపోయింది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో తొలి రోజు ఆట సగం రోజు వరకు సాగలేదు. తొలుత తొలి సెషన్ వరకు వేచి చూడగా, భోజన విరామం అనంతరం సైతం తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ క్రమంలోనే వరుణుడు కాస్త కనుకరించినా మైదానమంతా వర్షం నీటితో ఉండటంతో ఆంఫైర్తు ఆటను నిలిపివేశారు. రేపటి నుంచి మ్యాచ్ సజావుగా సాగితే తొలిరోజు కోల్పోయిన సమయాన్ని రిజర్వ్ డే రోజు నిర్వహించే అవకాశం ఉంది.