
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-1 సహా అన్ని పరీక్షల ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్వ్యూలు లేకుండా ఎలా ఎంపిక చేస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం ప్రకటించలేదు. మరి అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారో వేచి చూడాలి.