
ఇటీవల మరణించిన మావోయిస్టు హరిభూషణ్ భార్య, మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద మృతి చెందినట్లు సమాచారం. ఈనెల 24న ఆమె కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మావోయిస్టు చర్ల, శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారద డీసీఎంగా ఉన్నతి పొందారు. కరోనా మహమ్మారి శారదను కుంగదీసినట్లుగా తెలుస్తోంది.