
భారత్ లో కరోనా కల్లోలం వేళ పలు దేశాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. కెనడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రుడో బుధవారం ట్వీట్ చేశారు. భారత్ ఇప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. అంబులెన్స్ లు, పర్సనల్ ఎక్వివ్ మెంట్ కొనుగోలు చేసేందుకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా 60 కోట్ల రూపాయలను అందిస్తున్నాం. భారత్ క కావాల్సిన ఔషధాలను కూడా ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని పేర్కొన్నారు.