Automatic Climate Control Car: కాలం మారుతున్న కొద్దీ కార్ల వినియోగం పెరిగిపోతుంది. ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వెళ్లాలని అనుకునేవారు సొంతంగా వెహికల్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ తరుణంలో ఎలాంటి కారు కొనుగోలు చేయాలి? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కారు కొనుగోలు చేసేటప్పుడు ఫీచర్స్ తప్పనిసరిగా చూసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా సేప్టీ కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కార్లు ఈ మధ్య ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. కానీ వీటి ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత మార్కెట్లో రూ.10 లక్షల లోపు ఈ ఫీచర్ ఉన్న కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..
కారులో ప్రయాణించేటప్పుడు హాయిగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ముఖ్యంగా వేసవిలో కారు ఎంత చల్లగా ఉంటే అంత బాగుంటుంది. ఈ క్రమంలో ఆటోమేటిక్ క్లైమేట్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. వీటిలో హ్యాందాయ్ ఎక్స్ టర్ గురించి చెప్పుకోవచ్చు. ఈకారు మిడ్ స్పెక్ ఎస్ ఎక్స్ వేరయంట్ లో ఆటోమేటిక్ క్లైమేట్ ఫీచర్ అందిస్తుంది. ఈ కారు రూ.6.13 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
రెనాల్ట్ కంపెనికి చెందిన క్లైగర్ కూడా ఆటోమేటిక్ క్లైమటే్ ఫీచర్ ను అందిస్తోంది. దీనిని రూ.8 లక్షల ప్రారంభం నుంచి విక్రయిస్తున్నారు. నిస్సాన్ మాగ్నైట్ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ కారు సైతం వన్ ఎబోవ్ బేస్ ఎక్స్ ఎల్ వేరియంట్ లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ తో కలిగి ఉంది. దీనిని రూ.7.04 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. మారుతి కంపెనీకి చెందిన బ్రెజ్జా వన్ ఎబోవ్ బేస్ వేరియంట్ లో ఆటేమటిక్ క్లైమేట్ ఫీచర్ ను కలిగి ఉంది. దీనిని రూ.9.70 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
టాటా కంపెనీకి చెందిన రెండు మోడళ్లు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లను అందిస్తున్నాయి. వీటిలో ఒకటి పంచ్ స్పెక్ క్రియేటివ్ వేరియంట్ లోని మోడల్ రూ.8.85 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇదే కంపెనీకి చెందిన నెక్సాన్ సైతం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ని అందిస్తుంది.దీనిని రూ.9.80 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.