
కరోనా టీకా స్పుత్నిక్ లైట్ మూడో దశ ప్రయోగాలను భారత్ లో నిర్వహించేందుకు ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ కు నిఫుణుల బృందం అనుమతి నిరాకరించింది. దేశంలో ప్రయోగపరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ రెడ్డీస్ చేసిన దరఖాస్తుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం బుధవారం చర్చించింది. అనంతరం స్పుత్నిక్ లైట్ తుది పరీక్షలను నిర్వహించడానికి అనుమతి నిరాకరించినట్లు సబంధిత వర్గాలు వెల్లడించాయి.