ఒకే మాస్క్ ను ఉతక్కుండా రోజుల తరబడి ధరిస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త అని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శుభ్రంగా లేని మాస్క్ లు ధరిస్తే బ్లాక్ ఫంగస్ వచ్చే ముప్పు ఉంటుందన్నారు. ఏ రోజుకు ఆ రోజు మాస్క్ ను శుభ్రంగా ఉతుక్కున్న తర్వాతే వినియోగించడం సురక్షితమని సూచించారు. వెంటిలేషన్ సరిగ్గా లేని ఇళ్లల్లో ఉండేవారికి కూడా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు ఎక్కువన్నారు. అయితే ఇందుకు క్లినికల్ ఆధారాలు ఏవీ లేవని ఇంకొందరు […]
ఒకే మాస్క్ ను ఉతక్కుండా రోజుల తరబడి ధరిస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త అని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శుభ్రంగా లేని మాస్క్ లు ధరిస్తే బ్లాక్ ఫంగస్ వచ్చే ముప్పు ఉంటుందన్నారు. ఏ రోజుకు ఆ రోజు మాస్క్ ను శుభ్రంగా ఉతుక్కున్న తర్వాతే వినియోగించడం సురక్షితమని సూచించారు. వెంటిలేషన్ సరిగ్గా లేని ఇళ్లల్లో ఉండేవారికి కూడా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు ఎక్కువన్నారు. అయితే ఇందుకు క్లినికల్ ఆధారాలు ఏవీ లేవని ఇంకొందరు వైద్య నిపుణులు పేర్కొన్నారు.