‘మోడ్రన్ ఋషి’ అండ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా ఆద్భుతంగానే ఉంటుంది. ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ మనకు తెలియని ఎన్నో విషయాలను ముఖ్యంగా ప్రపంచంలో వింతలను, విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెబుతూ ఈ లాక్ డౌన్ లో నెటిజన్లను బాగా ఎంటర్ టైన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా పూరి నుండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది. టాపిక్ పేరు ‘డ్యూయెల్ సిటిజన్ షిప్’.
డ్యూయెల్ సిటిజన్ షిప్ గురించి పూరి మాట్లాడుతూ ‘పాండమిక్ తర్వాత చాలా దేశాలు ఈ 2021లో డ్యూయెల్ సిటిజన్ షిప్ ను ఆఫర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ డ్యూయెల్ సిటిజన్ షిప్ గాని మనం తీసుకుంటే, ఇక్కడైనా ఉండొచ్చు, అక్కడైనా ఉండొచ్చు. డొమెనికా..150 వేల డాలర్స్ అంటే కేవలం కోటి రూపాయలు అక్కడ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే చాలు, వాళ్లకు సిటిజన్ షిప్ ఇస్తారు. ఈ డొమెనికా పాస్ పోర్ట్ ఉంటే దాదాపు 130 దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంది.
మాల్డోవా అనే దేశం.. ఈస్ట్రన్ యూరోప్ లో ఉంటుంది. ఈ దేశం విషయానికి వస్తే.. 90 లక్షలు బ్యాంక్ డిపాజిట్ లేక ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఇక మీరు 122 కంట్రీస్‌కు వీసా లేకుండా హ్యాపీగా వెళ్లిపోవచ్చు. అలాగే టర్కీ.. ఇదొక ముస్లిం దేశం అని మనకు తెలుసు. అయినా ఇక్కడ రియల్ ఎస్టేట్, గవర్న్‌మెంట్ బాండ్స్ రూపంలో రెండు కోట్లు ఇన్వెస్ట్ చేస్తే.. నాన్ ముస్లింలకు కూడా ఇక్కడ ఈజీగా పాస్‌పోర్ట్ ఇచ్చేస్తారు. ఇక వీళ్లిచ్చే పాస్‌పోర్ట్ కి 112 దేశాలకు వరకు ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.
మాల్టా.. యూరోప్‌లోని మరో అందమైన దేశం. ఇక్కడ నాలుగున్నర కోట్లు ఇన్వెస్ట్ చేసినా.. వీళ్లు సిటిజన్ షిప్ ఇవ్వడానికి చాలా ఆలోచించి ఇస్తారు, ఒక్కోసారి నిరాకరించవచ్చు కూడా. ఇక వీళ్లిచ్చే పాస్‌పోర్ట్ వల్ల 155 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వనటు.. ఆస్ట్రేలియా వెదర్‌లోని దేశం. కోటిన్నర రూపాయలు ఆ గవర్న్‌మెంట్ కు ఇచ్చేస్తే ఇక అన్నీ వాళ్లే చూసుకుంటారట. 116 దేశాలకు వీసా ఫ్రీ. 45 రోజుల్లోనే సిటిజన్ షిప్ ఇచ్చేస్తారు. సెయింట్ లూసియా ద్వీపం, ప్రతి వ్యక్తి 70 లక్షల రూపాయలిస్తే నాలుగు నెలల్లోనే సిటిజన్ షిప్ ఇస్తారు. 146 దేశాలకు వెళ్లే అవకాశం దక్కుతుంది. ఇలా డ్యూయెల్ సిటిజన్ షిప్ ఇవ్వడానికి చాలా దేశాలున్నాయి. కానీ ఇండియా ఇలాంటి డ్యూయెల్ సిటిజన్ షిప్ కి ఒప్పుకోదు. అదే ట్విస్ట్’ అంటూ పూరి తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
