
ఏపీలో బీజేపీ నిర్వహిస్తున్న సంస్థాగత సమావేశాలలో భాగంగా, ఈరోజు మధ్యాహ్నం కాకినాడ పార్లమెంట్ జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షురాలు శ్రీమతి రేలంగి శ్రీదేవి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ, సూర్యనారాయణ రాజు, జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భవిష్యత్ కార్యక్రమాలు, స్థానిక ప్రజా సమస్యలపై చర్చించారు.