ఇండియన్ సినిమాలో శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతిలోక సుందరి వంటి అందంతో.. అంతకు మించిన అభినయంతో ఆమె వెండి తెరపై చెరగని ముద్ర వేశారు. అయితే.. అంతటి పాపులారిటీ పిల్లలకు ఒక రకంగా వరమైతే.. మరో రకంగా శాపమే అవుతుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ పాస్ ఈజీగానే దొరికినప్పటికీ.. తమను తామను నిరూపించుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే.. ప్రతీ విషయంలోనూ తమ పెద్దలతో పోలిక తెస్తుంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా ట్రోల్ చేసేస్తుంటారు.
ఇప్పుడు శ్రీదేవి కూతుళ్లు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పెద్ద కూతురు జాన్వీ కపూర్.. ఎంతో హైప్ తో బాలీవుడ్లో ల్యాండ్ అయ్యింది. కానీ.. తొలి సినిమా ఈ బ్యూటీని గట్టిగానే డిసప్పాయింట్ చేసింది. నెగెటివ్ రిజల్ట్ రావడంతో.. శ్రీదేవితో పోలిక తెచ్చి ట్రోల్ చేశారు. ఆ తర్వాత కూడా ఇబ్బందులను ఫేస్ చేస్తూనే కెరీర్ కొనసాగిస్తోంది.
అక్క పరిస్థితిని గమనించి ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టుంది చెల్లెలు ఖుషీ కపూర్. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే.. అందాలను ఆరబోస్తోంది. ఏకంగా బికినీతో ప్రత్యక్షమై నెటిజన్లను ఆశ్చర్య చకితులను చేసింది. కెరీర్ స్టార్ట్ కాకుండానే.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ బ్యూటీ.. ఇలా బోల్డ్ గా దర్శనం ఇవ్వడంతో నోరెళ్ల బెడుతున్నారు ఫాలోవర్స్.
ఇదిలాఉంటే.. ఖుషీ కపూర్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు తండ్రి బోనీకపూర్. నిన్నా మొన్నటి వరకు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇంట్రిడ్యూస్ చేస్తారనే ప్రచారం సాగింది. కానీ.. బాలీవుడ్లో నెపోటిజం ఎక్కువైందంటూ పెద్ద గొడవే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎందుకొచ్చిన గొడవలే అని ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
దీంతో.. తండ్రి బోనీ కపూరే కూతురును లాంఛ్ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఎలాగో.. బోనీ కపూర్ ప్రముఖ నిర్మాతగానే ఉన్నారు. దీంతో.. హోమ్ బ్యానర్ లోనే ఈ అమ్మడి ఫస్ట్ సినిమా వచ్చే అవకాశం ఉంది. మరి, ఎప్పుడు..? ఎవరితో? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.