BJP Punjab target : బీజేపీకి ఇప్పుడు 16 మంది ముఖ్యమంత్రులున్నారు. అయినా ఆకలి తీరని బెబ్బులిలాగా గాండ్రిస్తోంది. అతి త్వరలో 17వ ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంది. విశ్రాంతి అనేది లేదు. నిన్న జరిగిన పరిణామం ఆశ్చర్యంగా ఉంది. ఆప్ కు చెందిన 10 మంది రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు బీజేపీలో చేరారు. మూడింట రెండు వంతుల ఆప్ ఎంపీలు చేరడంతో అనర్హత అన్నది వారికి వర్తించదు. వీరేమీ సామాన్యులు కారు. రాఘవ చడ్డా.. కో ఫౌండర్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత. అవినీతి మరకలు లేని నిఖార్సైన ప్రశ్నించే నాయకుడు రాఘవ చడ్డా..
ఆప్ పార్టీకి దూరంగా ఉండడంపై రాఘవ చద్దా క్లారిటీ ఇచ్చారు. కేజ్రీవాల్ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లినప్పుడే నేను ఆ పార్టీకి దూరంగా ఉన్నట్టు రాఘవ చడ్డా క్లారిటీ ఇచ్చి బీజేపీలో చేరారు.
ఈ కీలక ఆప్ ఎంపీలు బీజేపీలో చేరడంతో పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆ పార్టీ బలం చాలా తగ్గింది. దీంతో ఈ ఊపులోనే పంజాబ్ ను కైవసం చేసుకునే దిశగా బీజేపీ కదులుతోంది.
బీజేపీ పార్టీ తదుపరి టార్గెట్ పంజాబ్.. దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.