
బీజేపీ, టీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కావని బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మాత్రం కలుస్తాయని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారు నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని.. ఉద్యోగాలు గురించి మాట్లాడట్లేదని విమర్శించారు. కాగా బండి సంజయ్ పాదయాత్ర 200 కి.వీ.కు చేరింది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో యాత్ర కొనసాగుతోంది.