Bigg Boss Telugu 9 Grand Finale: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ కి రికార్డు స్థాయిలో టీఆర్ఫీ రేటింగ్స్ రావడానికి ప్రధాన కారణం అయిన వాళ్ళు సెలబ్రిటీలే, అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు హౌస్ లో పుట్టించిన డ్రామా వల్లే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఈ షో ని ఇంత పెద్ద హిట్ చేశారు. తనూజ, ఇమ్మానుయేల్, భరణి, సంజన వీళ్ళే ఈ సీజన్ కి మూల స్తంభాలు.ముఖ్యంగా ఈ షో మొత్తం తనూజ చుట్టూనే తిరిగింది. ప్రతీ ఎపిసోడ్ లో ఆమె కంటెంట్ ఇస్తూ వచ్చింది, తన తెలివి తో సందర్భానికి తగ్గట్టుగా ఎత్తులు వేస్తూ మాస్టర్ మైండ్ అని అనిపించుకుంది. మొదటి 8 వారాలు ఓటింగ్ లో తనూజ కి దరిదాపుల్లో కూడా ఎవ్వరూ ఉండేవారు కాదు. ఆమెకు 60 శాతం ఓటింగ్ పడితే, మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ కలిపి 40 శాతం ఓటింగ్ పడేది.
కానీ ఫ్యామిలీ వీక్ లో పవన్ కళ్యాణ్ పండించిన సెంటిమెంట్, తనూజ ని టైటిల్ నుండి ఒక అడుగు వెనక్కి వేసేలా చేసింది. ఎప్పుడైతే ఆమె కళ్యాణ్ కి బాగా క్లోజ్ అయ్యి, అతని గెలుపులో తన గెలుపు చూసుకోవడం మొదలు పెట్టిందో, అప్పుడే కళ్యాణ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది టైటిల్. ఈరోజు ఆయనకు 40 లక్షల ప్రైజ్ మనీ, ఖరీదైన కారు దక్కింది. జీవితం లో ఎప్పుడూ చూడనంత డబ్బుని చూసేలా చేసింది. ఇక డిమోన్ పవన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇతను టాస్కులు అద్భుతంగా ఆడేవాడు, మొదటి 5 వారాల్లోనే రెండు సార్లు కెప్టెన్ కూడా అయ్యాడు. రెండు సార్లు కెప్టెన్ అవ్వడం తో హౌస్ మేట్స్ ఆ తర్వాతి వారాల్లో డిమోన్ పవన్ ని కెప్టెన్సీ కంటెండర్ ని చేయకుండా అడ్డు పడేవారు. లేదంటే ప్రతీ వారం ఆయనే కెప్టెన్ అయ్యేవాడు, అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తి డిమోన్ పవన్.
కానీ రీతూ చౌదరి తో ఇతను కలిసి చేసిన పులిహోర కంటెంట్ ఆడియన్స్ కి చిరాకు కలిగించేలా చేసింది. వీళ్ళిద్దరిని బయటకు తోసేస్తే బాగుండును అని ఆడియన్స్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ డిమోన్ పవన్ లోని ఆట ని చూసి, అతన్ని 8 వ వారం నుండి సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆడియన్స్. చివరి కెప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్ డిమోన్ పవన్ గ్రాఫ్ ని అమాంతం పెంచేసింది. ఇక ఆ తర్వాత రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యాక డిమోన్ పవన్ తన లోని యాంగిల్స్ మొత్తాన్ని బయటకు తీసాడు. ఒక సెక్షన్ ఆడియన్స్ ఇతనికి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యాడు. ఫలితంగా ఏకంగా ఇమ్మానుయేల్ ని దాటుకొని టాప్ 3 స్థానం లో నిలిచి 15 లక్షల రూపాయిల సూట్ కేసు తో బయటకి వచ్చాడు. అలా ఈ సామాన్యులు ఇద్దరు ప్రైజ్ మనీ కొట్టేసి, షో కి మూలస్తంభం లాగా నిల్చిన తనూజ, ఇమ్మానుయేల్ కి ఏమి దక్కకుండా చేశారు.