Big Breaking : జూన్ 7 న ముందస్తు బాంబు పేలనుందా? ఆ రోజు సీఎం జగన్ కీలక ప్రకటన చేయబోతున్నారా? ఎన్నికలపై క్లారిటీ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచే కేబినెట్ మీటింగ్ కు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. దీంతో ఇది ముమ్మాటికీ ముందస్తు ఎన్నికల కోసమేనంటూ అనుమానం ప్రారంభమైంది. అటు చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కలిసి చర్చలు జరపడంతో ఈ అనుమానానికి మరింత బలం చేకూరింది. దీనిపై జూన్ 7న మంత్రివర్గ సమావేశంలో జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలు జరగాలి. కానీ గత ఏడాదిగా ముందస్తు ఎన్నికలపై రకరకాల కథనాలు వెలువడ్డాయి. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అయితే ఈసారి మాత్రం జగన్ తప్పకుండా ముందస్తుకు వెళతారని టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్టే ఆయన చర్యలు ఉన్నాయి. గత నెల చివరిని జగన్ ఢిల్లీ వెళ్లారు. మూడు రోజుల పాటు ఉన్నారు. ఢిల్లీ పెద్దలను కలిశారు.ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే కేంద్ర పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ పొందారని ప్రచారం సాగుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లడమే ముఖ్యమని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. 7న జరిగే కేబినెట్ మీటింగులో ప్రధానంగా నవరత్నాలపై చర్చించనున్నట్టు సమాచారం. ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఇంకా ఏ వర్గాల్లో అసంతృప్తి ఉంది? అన్నదానిపై సమగ్రంగా చర్చిస్తారు. ఆ వర్గాలకు అనుకూలంగా కీలక ప్రకటనలు చేస్తారు. వీలైనంత వరకూ వారికి స్వాంతన కలిగే నిర్ణయాలు తీసుకుంటారు. అనంతరం జగన్ నేరుగా ముందస్తు ఎన్నికల విషయంలో స్పష్టతనిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతానికైతే ప్రకటన చేస్తారు. ఆగస్టు లేకపోతే అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని వైసీపీ వర్గాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాయి మరో వైపు పవన్ కళ్యాణ్ వారాహీ రధయాత్రను ఈ నెల 14 నుంచి మొదలెట్టబోతున్నారు. చంద్రబాబు కూడా బీజేపీ పెద్దలను కలిశారు. పొత్తు కుదుర్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలా ఏపీ రాజకీయాలు స్పీడు పెరుగుతున్న కొలదీ ముందస్తు ఎన్నికల అంచనాలు పెరుగుతున్నాయి. ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి. మరో రెండురోజుల్లో ముందస్తు ఎన్నికలపై పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందన్న మాట. అంతవరకూ వెయిట్ చేయాల్సిందే.