
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరో్నా టీకా తీసుకున్నారు. ముంబైలో నిన్న వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆదివారం ఉదయం ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అమితాబ్ తన మొదటి డోసును ఏప్రిల్ 2న తీసుకున్నారు. నిన్న కుటుంబంతో పాటు, స్టాఫ్ అంతా పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ నెగెటివ్ వచ్చింది. అభిషేక్ ప్రస్తుతం లోకేషన్ లో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో అతను తిరిగి రానున్నాడు. అప్పుడు అతడు కూడా వ్యాక్సిన్ తీసుకుంటాడు. అని ఇన్ స్టాలో పేర్కొన్నారు.